Viral ఇంట్లో రెండే బల్బులు.. కరెంట్ బిల్ మాత్రం రూ.1,05,032 Current Bill - Tv9

ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్‌ బిల్లులు షాక్‌ కొడుతున్నాయి. రాష్ట్రంలో సామాన్యులకు పెను భారంగా మారుతున్నాయి విద్యుత్‌ బిల్లులు. తాజాగా ఓ చిన్న పెంకుటింట్లో జీవించే సామాన్యుడికి వేలల్లో కరెంట్‌ బిల్లు రావడంతో లబోదిబోమంటున్నాడు. అతని ఇంట్లో కనీస అవసరాలైన ఫ్యాన్‌, ఫ్రిజ్‌, ఏసీ, ఏవీ లేవు. అయినా అతనికి వందల్లో రావాల్సిన కరెంట్‌ బిల్లు ఏకంగా వేలల్లో వచ్చింది. ఇలా ఎందరో సామాన్యులు తమ కరెంటు బిల్లులు చూసి షాకవుతున్నారు.