మ్యాడ్ స్క్వేర్ అందరినీ నవ్వించిందా.. మూవీపై రెస్పాన్స్ ఇదే

సితార బ్యానర్‌ నుంచి వచ్చిన సినిమాల్లో.. అందర్నీ నవ్వించి.. మెప్పించిన సినిమా మ్యాడ్. అలాంటి ఈ సినిమాకు సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కింది. మ్యాడ్ సినిమాను మించి ఈ సినిమాలో మ్యాడ్ మ్యాక్స్ ఉంటుందని... అందరూ కడుపుబ్బా నవ్వడం గ్యారెంటీ అని ఈ మూవీ టీం ప్రమోషన్స్‌లో కాస్త గట్టిగానే చెప్పింది. మరి మ్యాడ్ స్క్వేర్ టీం చెప్పినట్టే ఈ మూవీ హిలేరియస్ గా ఉందా? అందర్నీ నవ్వించిందా? మ్యాడ్ సినిమాను మరిపిస్తుందా? మరో హిట్ ఫిల్మ్ గా సితార బ్యానర్‌లో నిలవనుందా? అనేది తెలియాలంటే వాచ్ దిస్ మూవీ రివ్యూ...!అశోక్ అలియాస్ నార్నే నితిన్, సంగీత్ శోభన్ అలియాస్ డిడి, మనోజ్ అలియాస్ రామ్ నితిన్ కాలేజ్ తర్వాత ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీ అయిపోతారు.