జ్ఞానవాపి కేసులో అలహాబాద్ హైకోర్ట్ కీలక తీర్పు - Tv9

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్‌ హైకోర్టు కీలకతీర్పు ఇచ్చింది. ఈ కేసులో ముస్లిం సంస్థలకు చుక్కెదురైంది. పురావస్తు విభాగం సర్వేకు వ్యతిరేకంగా ముస్లిం సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇలా మొత్తం ఐదు పిటిషన్లను కోర్టు కొట్టేసింది. అలాగే, ఆరునెలల్లో ఈ కేసులో విచారణ పూర్తిచేయాలని వారణాసి కోర్టుకు అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. అసలు ఈకేసు ఏంటో చూద్దాం. జ్ఞానవాపి మసీదులో శృంగార గౌరి ప్రతిమలు ఉన్నాయని హిందూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. ఆ మసీదులో వాజుఖానా దగ్గర శివలింగం కూడా ఉందని వాదించాయి. కానీ అది వాటర్‌ ఫౌంటెయిన్‌ అని ముస్లిం సంస్థలు వాదించారు. ఈ మొత్తం వ్యవహారంపై సర్వే చేయాలని అలహాబాద్‌ హైకోర్టు- పురావస్తు విభాగాన్ని ఆదేశించింది.