సంక్రాంతి రేస్ నుంచి...రజినీ అవుట్ Rajinikanth Sankranti 2024 - Tv9

సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. ఈ సినిమాకు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాలను రూపొందిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ ఈసినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో విక్రాంత్‌, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ క‌పిల్ దేవ్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 9న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు.