వికారాబాద్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి వెళుతున్న కారు చెరువులోకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ప్రస్తుతం పోలీసులు గజ ఈతగాళ్లతో ఆ వ్యక్తి కోసం గాలిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో వికారాబాద్ లోని అనంతగిరి హిల్స్ ను చూసేందుకు కారులో ఐదుగురు స్నేహితులు బయలుదేరారు. అందులో నలుగురు అబ్బాయిలు కాగా ఒక అమ్మాయి ఉంది. రఘు,మోహన్, సాగర్, గుణశేఖర్ తో పాటు పూజిత కారులో ఉన్నారు. వీకెండ్ కావడంతో అనంతగిరి హిల్స్ చూసేందుకు బయలుదేరిన వీరు శివారెడ్డి పేట దగ్గర ఒక్కసారిగా కారు చెరువులోకి దూసుకు వెళ్ళింది.