అయ్యప్ప భక్తులకు వాన కష్టాలు..వాతావరణ శాఖ హెచ్చరిక - Tv9

శబరిమల అయ్యప్ప భక్తులకు వాన కష్టాలు మొదలయ్యాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణశాఖ అయ్యప్పభక్తులను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని, నడిచి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈశాన్య రుతుపవనాల కారణంగా భారీవర్షాలు కురుస్తున్నాయి.