సీఎం జగన్‎పై రాళ్ల దాడి.. సిన్ రీ కంస్ట్రక్ట్ చేస్తున్న ప్రత్యేక బృందం..

సీఎం జగన్‎పై రాళ్ల దాడి జరిగిన ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మరోసారి దాడి జరిగిన ప్రదేశాన్ని అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రాత్రి సీఎం జగన్ పై రాళ్లు రువ్విన ఘటనపై సిన్ రీ కంస్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 300 మీటర్ల వరకూ ఎవరినీ అనుమతించడం లేదు. ఘటన స్థలం చుట్టూ అనేక టీంలుగా విడిపోయిన ప్రత్యేక పోలీసు బృందాలు దాడి జరిగిన విధానాన్ని పరిశీలిస్తున్నారు.