వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓటమి అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ టీమిండియా డ్రెస్సింగ్ రూములోకి వెళ్లి ఆటగాళ్లలో ధైర్యం నూరిపోసి, స్ఫూర్తి నింపే పెప్‌టాక్ చేశారు. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. శివసేన నేత ప్రియాంక చతుర్వేది మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటమిని జీర్ణించుకోలేని ఆటగాళ్లు అసౌకర్యంగా కనిపిస్తుంటే ప్రధాని అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించారు.