అమెరికాలో భారత సంతతి సంపన్న కుటుంబం మృతి కేసులో సంచలన నిజాలు! - Tv9

అమెరికాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంపన్న కుటుంబానికి చెందిన కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయింది. నివేదిక ప్రకారం.. భార్య, కుమార్తెలను భర్త తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. ఈ మేరకు నార్ఫోక్ డిస్ర్టిక్‌ అటార్నీ మైఖేల్ మోరిస్సే కార్యాలయం తెలిపింది. ఈ కేసులో పూర్తిస్థాయి నివేదిక త్వరలో వస్తుందని పోలీసులు తెలిపారు.