భారీ వర్షాలు..ఎనిమిది జిల్లాలకు అలర్ట్ - Tv9

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ కొనసాగుతోంది. కుండపోత వానలతో నీలగిరి జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. అక్కడక్కడ కొండ చరియలు విరిగి పడ్డాయి. భారీ వృక్షాలు , విద్యుత్ స్థంబాలు నేలకూలాయి. నీలగిరి కొండలపై కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. మరోరెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది..