సిమ్లాకు పోటెత్తిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్ Shimla - Tv9

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప‌ర్యాట‌కుల‌తో కిట‌కిట‌లాడుతోంది. ఇయ‌ర్ ఎండ్ సెల‌బ్రేష‌న్స్ కోసం సిమ్లాకు టూరిస్టులు పోటెత్తుతున్నారు. గత కొంత కాలంగా భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం పర్యాటకులతో కళకళలాడుతోంది. న్యూ ఇయర్ రావడంతో దేశంలోని పలు ప్రాంతాల నుంచి కొండ ప్రాంతానికి భారీగా తరలి వస్తున్నారు. దీంతో సిమ్లా, మనాలి, కసోల్ లో భారీగా వాహనాల రద్దీ కొనసాగుతోంది. జస్ట్ మూడు రోజుల్లోనే లక్షల సంఖ్యలో వెహికిల్స్ సిమ్లాలోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.