దురాశతో ఓ యువకుడు తన అమ్మమ్మకు బీమా చేయించి పాము కాటు వేయించాడు - Tv9

బీమా పేరుతో అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఉదంతాలు ఆగడం లేదు. రోజుకో ఏదో ఒకచోట వెలుగు చూస్తునే ఉన్నాయి. డబ్బుల కోసం నా అనుకున్న వారినే అంతమొందిస్తున్న కథనాలు విస్తుగొల్పుతున్నాయి. బీమా సొమ్ము కోసం కక్కుర్తి పడి అమ్మమ్మను స్వయానా మనవడే హత్య చేసిన ఘటన చత్తీస్‌గఢ్‌లో వెలుగు చూసింది. ఏదో తేడా కొడుతోందన్న పోలీసుల అనుమానం నిజమైంది.