తన అభిమాన హీరోకు రూ.72 కోట్ల ఆస్తిని రాసిచ్చిన వీరాభిమాని వీడియో

సినీ హీరోలకు అభిమానులు కోట్లలో ఉంటారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్‌ అవుతుందంటే వారి హడావిడి అంతా ఇంతా కాదు. థియేటర్ల దగ్గర భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తారు. పాలాభిషేకాలు చేస్తారు. ఇదొకరకమైన అభిమానం అయితే.. కొందరు తమ కుటుంబ సభ్యులకంటే కూడా ఎక్కువగా ఈ హీరోలను అభిమానిస్తుంటారు. కానీ, తాను అభిమానించే హీరోకు ఏకంగా కోట్ల రూపాయల విలువైన ఆస్తులను రాసివ్వడం ఎప్పుడైనా విన్నారా...? అవును ఓ అభిమాని తన అభిమాన హీరోకి ఏకంగా కోట్ల విలువైన ఆస్తిని రాసిచ్చారు. విషయం తెలిసిన ఆ హీరో చలించిపోయారు.