అసదుద్దీన్ ఓవైసీ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ముస్లీం సామాజికవర్గ ప్రజల సమస్యలపై తనదైన శైలిలో గళాన్ని వినిపిస్తారు. పార్లమెంట్లో మైనార్టీ హక్కుల కోసం గట్టిగా పోరాటం చేశారు. కేంద్రం నిర్ణయాలను తప్పుబడుతూ వాటికి వ్యతిరేకంగా అనేక సార్లు తన భావనను వ్యక్తం చేశారు. ఇలా నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు అసదుద్దీన్. అలాగే తన నియోజకవర్గ ప్రజలతో అప్పుడప్పుడూ మాటా మంతి నిర్వహిస్తూ ఉంటారు. సరదాగా బుల్లల్ బండిపై ఓల్డ్ సిటీ పురవీధుల్లో తిరుగుతూ తన పార్టీ కార్యకర్తల్లో సరికొత్త జోష్ నింపుతూ ముందుకు సాగుతూ ఉంటారు. అయితే తాజాగా మరోసారి ఎవరూ ఊహించని ఫీట్లతో కనిపించి అందరినీ షాక్ కి గురిచేశారు.