సంతోషంలో.. సంబరాలు.. రెబల్ ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు.

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన కల్కి సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన రెండు వారాల్లోనే కల్కి సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరింది.