ట్యాంక్ బండ్ వేదికగా ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు - Tv9

కార్‌ రేసింగ్‌ పోటీలకు హైదరాబాద్‌ వేదిక కానుంది. నవంబర్‌ 4, 5 తేదీల్లో సాగర తీరాన ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ జరగబోతోంది. అంతర్జాతీయంగా ఆదరణ పొందిన ఈ పోటీలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇన్నాళ్లు స్పోర్ట్స్‌ చానెల్స్‌లో రేసింగ్‌ పోటీలు చూసి ఇంట్రెస్ట్‌ పెంచుకున్న నగరవాసులకు ప్రత్యక్షంగా తిలకించే అవకాశం మళ్లీ వచ్చింది. గతేడాది నవంబర్‌లో మొదటిసారిగా ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ పోటీలు హుస్సేన్‌సాగర్‌ తీరం కేంద్రంగా జరిగాయి.