ఇటీవల మిచౌంగ్ తుపాను తమిళనాడును అతలాకుతలం చేసిన సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూర్‌కు చెందిన 40 ఏళ్ల మునుస్వామి మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మునుసామి.. క్యాన్సర్‌తో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు.. ఈదురు గాలుల్ని భారీ వర్షాన్ని లెక్కచేయక 200 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించి ఎంతో విలువైన మందును అందజేశారు. స్టెమ్ సెల్ ఎన్జీవో డెట్రాయ్‌లో పని చేస్తున్న తనకు ఔషదం చేర్చడం ఎంత ముఖ్యమో తెలుసుననీ ఆయన అన్నారు.