పోలీసు అధికారులకు వైఎస్ జగన్ వార్నింగ్..

ఏపీ పోలీసు అధికారులకు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఎల్లకాలం టీడీపీ పాలన కొనసాగదని.. తాము అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు ఊడిగం చేసేవారికి శిక్ష తప్పదన్నారు. టీడీపీ పట్ల పక్షపాతంతో వ్యవహరించే పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. యూనిఫామ్‌ తీయించి చట్టం ముందు నిలబెడతామన్నారు.