Viral ప్రాణభయంతో సింహం పరుగు.. ఏం జరిగిందంటే.. - Tv9

సింహం అంటే అడవికి రాజు.. సింహాన్ని చూసి అన్ని జంతువులూ భయపడతాయి. సింహం గర్జన వింటేనే ఎక్కడి జంతువులక్కడ గప్‌చుప్‌గా ఉండిపోతాయి. అలాంటిది ఓ సింహం మరో జంతువును చూసి ప్రాణ భయంతో పరుగులు తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సింహం కూడా భయపడుతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో.. రెండు ఖడ్గ మృగాలు అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాయి. ఆ దారిలో రెండు సింహాలు అడ్డంగా పడుకొని ఉన్నాయి. మంచి నిద్రలో ఉన్న ఆ సింహాలకు ఏదో జంతువు వస్తున్న అలికిడి వినపడింది.