బొగ్గు లారీని ఢీ కొట్టిన బస్సు...అసోంలో ఘోర ప్రమాదం - Tv9

అస్సాం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్‌లోని డెర్గావ్ సమీపంలో గల బలిజం ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున తీన్‌కతియాలోని తిలింగ మందిర్‌కు 45 మంది ప్రయాణికులు బస్సులో బయలుదేరారు. గోలాఘాట్‌ నుంచి తీన్‌కతియా వైపు వెళ్తుండగా అదే మార్గంలో ఎదురుగా వస్తున్న బొగ్గులోడు ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.