అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం! @Tv9telugudigital

హమాస్‌-ఇ్రజాయెల్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ హమాస్‌ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందునాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే.. ఇజ్రాయెల్‌తో ఐదేళ్లు, అంతకంటే ఎక్కువకాలం సంధికి సిద్ధంగా ఉన్నామన్నారు. అదేవిధంగా ఆయుధాలు వీడి.. గాజా, వెస్ట్ బ్యాంక్‌లో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు ‘పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌’లో చేరాలనుకుంటున్నట్లు ఓ వార్తాసంస్థతో తెలిపారు.