రైలు పట్టాలపై ట్రక్.. ఇంతలో దూసుకొచ్చిన రైలు వీడియో

మహారాష్ట్రలో ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా రైల్వే పట్టాలపైకి దూసుకొచ్చిన ట్రక్కు..రైల్వే గేటును ఢీకొని, పట్టాలపైకి చేరుకుంది. ఇంతలో అదే ట్రాక్‌పైకి వేగంగా వచ్చిన అంబా ఎక్స్‌ప్రెస్‌ ఆ ట్రక్కును బలంగా ఢీకొంది. అయితే అంతకన్నా ముందే ట్రక్కు డ్రైవర్‌ కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. జల్గావ్‌ జిల్లాలోని బోద్వాల్ రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.