రైల్వేకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో లింగరాజ్ స్టేషన్ వద్ద నాలుగు రైళ్లు ఒకే ట్రాక్‌పై ఉన్న వీడియో సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది. దీంతో కొందరు రైల్వేలోని భద్రతా లోపాలకు ఈ వీడియో అద్దంపడుతోందంటూ షేర్ చేయడం మొదలు పెట్టారు. వరుస రైలు ప్రమాద ఘటనల నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడం ఆందోళనకు కారణమైంది.