ఏపీలో సంక్రాంతి సెలవులపై కన్‌ఫ్యూజన్ నెలకొన్న క్రమంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జనవరి 11–15 లేదా జనవరి 12–16 వరకు సెలవులు కుదిస్తున్నారన్న ప్రచారంలో నిజం లేదని తెలిపింది. సెలవులు అధికారిక అకడమిక్ పాఠశాల క్యాలెండర్ ప్రకారమే ఉంటాయని ప్రభుత్వం ధృవీకరించింది. ఆంధ్రాలో సంక్రాంతి పండుగ ఎంత గొప్పగా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.