ఆమె స్వరం స్వరరాగ గంగాప్రవాహం.. కోయిలను మరిపించిన సుమధుర వాణి.. ఆమె గళం ఉరికే ఝరి.. అది భక్తిగీతమైనా.. యుగళగీతమైనా.. జానపదమైనా.. ఆ గొంతులో అలవొకగా సాగాల్సిందే. మధుర్యాన్ని తన వంటపట్టించుకున్న గానకోకిల పద్మభుషణ్ పి.సుశీల. తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించారు. వివిధ భాషల్లో కలుపుకుని కొన్ని వేల పాటలు పాడారు. సుశీల.. ఎస్పీ బాలు కలిసి మరెన్నో పాటలను పాడారు. ఆమె అంటే ఆయనకు ఎంతో ఆత్మీయత… ఆయనంటే ఆమెకి ఎంతో అభిమానం. అందువల్లనే ఒకరి పేరును గురించి ఒకరు ప్రస్తావించకుండా పాటను గురించి మాట్లాడలేరు.