కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందు దొందే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీలను చంపాల్సిన కర్మ ఎవరికి లేదన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేళ ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్న కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం అధినేతలను భౌతికంగా కాదు రాజకీయంగానే పాతబస్తీ ముస్లింలు సమాధి కట్టేస్తారన్నారు.