చైనాకు చెందిన 38 ఏళ్ల పిన్న వయస్కులైన వ్యోమగాములు రికార్డు సృష్టించారు. అంతరిక్ష నౌకను ప్రయోగించిన ఆరున్నర గంటల్లోనే ఆ దేశానికి చెందిన అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ముగ్గురు చైనీస్ వ్యోమగాములతో షెంజౌ-17 అంతరిక్ష నౌకను జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి గురువారం లాంచ్ చేశారు. అనంతరం 6.5 గంటల్లోనే టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం ఫార్వర్డ్ పోర్ట్‌కు ఆ స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా డాక్ అయ్యింది.