ముక్కో ఏకాదశి రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. ఇందులో భాగంగానే ప్రముఖ దైవ క్షేత్రం.. తిరుమలలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. స్వామివ్వారిని ఉత్తరం ద్వారం గుండా దర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు తిరుమలకు వచ్చారు. వీఐపీల వైకుంఠ ద్వారా దర్శనానికి మూడు గంటలు పట్టింది. ఇక 5:14 గంటలకు సర్వ దర్శనం భక్తుల క్యూలైన్ ప్రారంభమైంది.