అమెరికాలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. తన దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షించారు ఉషా వాన్స్. నూతన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి, భారత సంతతి మహిళ అయిన ఆమె గురించి తెలుసుకునేందుకు అమెరికన్లు ఆసక్తి చూపిస్తున్నారు. మతం, పౌరసత్వం వంటి వ్యక్తిగత సమాచారం కోసం గూగుల్‌లో సెర్చ్ చేశారు ఉషా చిలుకూరి అమెరికాలో కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి.