శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయ్యప్ప దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో శబరిగిరులు కిక్కిరిసిపోయాయి. స్వామి దర్శనం కోసం భక్తులు వేలాదిగా క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు భక్తులందరికీ స్వామివారి దర్శనం కలిగేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దగ్గరుండి స్వామివారి దర్శనానికి పంపిస్తున్నారు భద్రతా సిబ్బంది. మణికంఠుడి దర్శనానికి 12 గంటలు సమయం పడుతోంది.