బిగ్ సీజన్ 7 మొదలైనప్పటి నుంచి.. నిన్నమొన్నటి వరకు పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్ దీప్ అన్నట్టుగానే సాగింది. ఇద్దరూ కొట్టుకోవడం.. అన్నా.. అన్నా అని పిలుచుకోవడం.. మళ్లీ ఎడ మొహం పెడ మొహంగా ఉండడం.. కామన్ అయిపోయింది. కానీ ఫ్యాన్స్ మాత్రం దీన్నంతా సీరియస్‌గా తీసుకుని.. గ్రాండ్ ఫినాలే ముగియగానే కొట్టుకున్నారు. అందులో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే మరీ రెచ్చిపోయారు. అమర్ కార్‌తో పాటు.. ఇతర కంటెస్టెంట్ల కార్లను.. ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. పల్లవి ప్రశాంత్ కూడా.. పోలీసులు చెప్పిన మాట వినక.. చిక్కుల్లో ఇరుకున్నారు. చివరికి జైలు పాలై.. బెయిల్ మీద బయటికి వచ్చాడు. అయితే ఇదంతా జరిగిన ఇన్ని రోజులకు తాజాగా.. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై నోరు విప్పాడు అమర్ దీప్.