తామొకటి తలిస్తే.. తమ దేవుడు పవన్ మరోటి తలిచినట్టే జరుగుతుంది ఇప్పుడు. పవన్ ఫ్యాన్స్ ఏమో... ఎప్పుడెప్పుడు ఓజీ చూద్దామా అనే ఆరాటంలో ఉంటే.. పవన్ మాత్రం ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్‌లో గెలవాలా అని చూస్తున్నారు. అందుకే ఓజీ షూటింగ్‌ను కూడా పక్కకు పెట్టేశాడు. మరో సారి సీరియస్ పొలిటీషిన్‌గా మారిపోయారు. సుజీత్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న మూవీ ఓజీ. పవన్ సినిమాల్లో కెళ్లా మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని... అతి తొందర్లో థియేటర్లో చూడాలనుకున్నారు పవన్ ఫ్యాన్స్.