అమ్మంటే అమ్మే.. శత్రువుకైనా కడుపునిండా తిండి పెట్టే జన్మే. అవును ఆ శునకం అలాగే చేసింది జాతి వైరాన్ని మరచి మేక పిల్లను హక్కున చేర్చుకుని తన పిల్లలతో పాటు పాలిచ్చి కడుపు నింపింది. ఈ ఘటన అడవుల జిల్లా ఆదిలాబాద్ లోని భీంపూర్ మండలం భగవాన్ పూర్ లో చోటు చేసుకుంది.