అయ్యప్ప భక్తుల కోసం ‘అయ్యన్’ యాప్ - Tv9

శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్పమాల ధరించి, మండల పూజలు నిర్వహించి స్వామి దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులకోసం ఓ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది కేరళ అటవీశాఖ. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అయ్యన్‌ అనే పేరుతో యాప్‌ను సిద్ధం చేసింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో పనిచేసేలా రెడీ చేసిన ఈ యాప్ ద్వారా అయ్యప్ప భక్తులు పలు సేవలు పొందవచ్చు.