శీతల గాలులతో కాశ్మీర్‌లోని శ్రీనగర్ గజగజా వణుకుతోంది. చలిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు మంచు, మరోవైపు చలిగాలులతో జనం అల్లాడుతున్నారు. చలిగాలులతో జన జీవనం స్థంభించింది. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. మరోవైపు దట్టమైన పొగమంచు కమ్మేయడంతో రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోజిలా పాస్ సమీపంలోని అజ్రి నల్లాలోని సోన్‌మార్గ్ పరిసర ప్రాంతాలు మంచుతో నిండిపోయాయి.