రాజేంద్ర ప్రసాద్‌కు ప్రభాస్ పరామర్శ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌ను యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ పరామర్శించారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించారు. కూకట్ పల్లిలోని ఇందు విల్లాస్ లోని రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లిన ప్రభాస్ ఆయన కూతురు గాయత్రి చిత్రపటం నివాళులు అర్పించారు. అనంతరం కూతురు మృతితో తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన రాజేంద్రప్రసాద్ ను.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.