సముద్రఖనితో వేణు స్వామి ప్రత్యేక పూజలు నైవేద్యంగా మటన్ కర్రీ..

సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. అలాగే స్టార్ హీరోలు, హీరోయిన్లతోనూ పూజలు, పునస్కారాలు చేయిస్తుంటారాయన. ఈ మధ్యన వేణు స్వామి చెబుతోన్న జాతకాలు తప్పుతున్నాయి. విమర్శలు కూడా వస్తున్నాయి. నెట్టంట స్వామీజీపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. అయితే కొందరు సినిమా సెలబ్రిటీలు మాత్రం వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. తాజాగా వెర్సటైల్ యాక్టర్ సముద్రఖని కూడా ఇదే చేశారు.