రజినీ ధాటికి... షేక్ అవుతున్న కడప Rajinikanth - @Tv9entertainment

తమిళ్ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్‌ కడప జిల్లాలో సందడి చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గ ఎర్రగుంట్ల ప్రాంతంలో ఉన్న నాపరాయి క్వారీలో తలైవా లేటెస్ట్ మూవీ వెట్టియన్ షూటింగ్ జరిగింది. అందులో భాగంగా రజనీకాంత్ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను ఈ క్వారీలో చిత్రీకరించారు. దీంతో రజినీ కాంత్‌ను చూసేందుకు కడప జిల్లా చుట్టుపక్కల నుంచి చాలా మంది వచ్చారు. తళైవాను చూసి ఎగిరిగంతేశారు.