టెక్నాలజీ పెరుగుతున్న ప్రస్తుతకాలంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెట్రేగిపోతున్నాయి. ఇప్పటికి వరకు ప్రభుత్వ వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ తాజాగా ఇండియన్స్ ఆధార్ వివరాలను హ్యాక్ చేశారు. ఏకంగా 81.5 కోట్ల భారతీయుల వివరాలు డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ 'రిసెక్యూరిటీ' వెల్లడించింది. :లీకైన డేటాలో పేర్లు, వయసు, ఆధార్ నెంబర్, పాస్‌పోర్ట్ సమాచారం, మొబైల్ నెంబర్స్ వంటివి ఉన్నట్లు సమాచారం.