రైలు ప్రయాణీకులకు గుడ్ న్యూస్ - Tv9

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లోల ప్రయాణిస్తుంటారు. ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సదుపాయాలను మెరుగు పరుస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో రైల్వే ఏసీ కంపార్ట్​మెంట్లలో ప్రయాణించే ఆర్​ఏసీ ప్యాసింజర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఇండియన్​ రైల్వే. ఇక నుంచి ఆర్​ఏసీ టికెట్​ కలిగిన ప్రతి ప్రయాణికుడికి ప్రత్యేక బెడ్​ రోల్​ కిట్​ను అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రైల్వే బోర్డు ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శైలేంద్ర సింగ్​ చెప్పారు. ఈ కిట్​లో ఒక బెడ్​షీట్​, దుప్పటి, టవల్​తో పాటు ఓ తలగడ కూడా ఉంటుందని వివరించారు. అయితే ఇది ఏసీ ఛైర్​ కార్​ ప్రయాణికులకు వర్తించదని ఆయన చెప్పారు.