రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక డ్రగ్స్‌పై ప్రత్యేక దృష్టిసారించింది. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామని, తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, డ్రగ్స్‌తో దొరికితే ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. ఈ నేపథ్యంలో గత రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని పలు పబ్బులపై పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో తొలిసారి స్నిఫర్ డాగ్స్ ఉపయోగించారు.