శబరిమల అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి దర్శనానికి సుమారు 20 గంటలకు పైగా సమయం పడుతుండడంతోంది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. గడిచిన ఐదు రోజులుగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది.. రద్దీని అంచనా వేయడంలో, ఏర్పాట్ల విషయంలో కేరళ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అయ్యప్ప భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రభుత్వం విఫలమయ్యిందంటూ తిరువనంతపురంలో బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. దీంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు బీజేపీ కార్యకర్తల్ని చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. ఆపై లాఠీ చార్జ్ కూడా చేశారు.