గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన యువ పైలట్ గుండెపోటుతో మృతిచెందారు.విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విజయవంతంగా ల్యాండ్‌ చేసిన అనంతరం అస్వస్థతతో ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పైలట్‌ అర్మాన్ బుధవారం శ్రీనగర్‌ నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్‌ చేశారు. అయితే, అతడికి ఇదే చివరి విమాన ప్రయాణం అవుతుందని ఊహించలేదు.