బెంగళూరులో ప్రత్యక్షం... కింగ్ ఛార్లెస్ పర్యటనపై అంతా రహస్యం

బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌ ఆయన సతీమణి క్వీన్‌ కెమిల్లా బెంగళూరులో సీక్రెట్‌గా ఓ వెల్‌నెస్‌ కేంద్రం లో చికిత్స తీసుకున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. బ్రిటన్‌ రాజదంపతులు సీక్రెట్‌గా ఇండియా ట్రిప్‌కు వచ్చినట్లుగా కథనాలు రాసారు. అక్టోబరు 27 నుంచి వారిద్దరూ బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. వెల్‌నెస్‌ కేంద్రంలో యోగా, మెడిటేషన్‌ సాధనలో సమయం గడిపినట్లు తెలుస్తోంది.