ఎలుకల్ని అంత ఈజీగా తీసుకోకండి.. ఎలుకలతో పెట్టుకుంటే సామ్రజ్యాలే కూలిపోతాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన. అవును ఓ రెస్టారెంట్ ఎలుక కారణంగా తన షేర్లను భారీగా నష్టపోయింది. ఆ రెస్టారెంట్ ఓ కస్టమర్‌కి సర్వ్ చేసిన సూప్‌లో ఎలుక రావడంతో ఆ కంపెనీ షేర్లు పతనమైపోయాయి. ఈ ఘటన జపాన్‌లో జరిగింది. సాధారణంగా కార్పొరేట్ సంస్థల్లో నిర్వహణ లోపాలు బయటపడితేనో, ఆ రంగంలో ప్రతికూల ప్రభావం చూపే వార్తలు వచ్చిన సందర్భాల్లోనో, లేదా త్రైమాసిక ఫలితాలు సరిగా లేకపోతేనో ఆ కంపెనీ షేర్లు ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. కానీ జపాన్‌కు చెందిన జెన్షో హోల్డింగ్స్ కంపెనీ షేర్లు పతనానికి తమ ఆధీనంలోని ఓ రెస్టారెంట్‌లో కస్టమర్‌కు సర్వ్ చేసిన సూప్‌లో ఎలుక పడటం కారణం అయింది.