బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో మరో వారం పూర్తయ్యింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా ఐదు వారాల్లో ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఐదో వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండడంతో ఆదిత్య ఓం బయటకు వెళ్లిపోయాడు. ఇక వీకెండ్ లో పొట్టి పిల్ల, ఢీ ఫేమ్ నైనిక ఎలిమినేట్ అయ్యింది. షో ప్రారంభంలో నైనిక ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించింది.