దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రజలంతా ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకల్లో మునిగితేలారు. ఇక హోలీ వేళ.. నోరు తీపి చేసుకునేందుకు పక్కాగా స్వీట్ ఉండాల్సిందే..! ఈ క్రమంలో మార్కెట్లో రకరకాల స్వీట్లు సిద్ధమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఓ దుకాణదారు తయారుచేసిన కజ్జికాయలు నోరూరిస్తున్నాయి. కానీ, వాటి ధర చూసి కస్టమర్లు అవాక్కవుతున్నారు. అవును మరి, ఆ కజ్జికాయల ధర కేజీ రూ.50వేలట. ఎందుకు.. బంగారంతో ఏమైనా తయారుచేశారా? అంటే అవుననే అంటున్నారు ఆ యజమాని. 24 క్యారెట్ల పుత్తడితో చేసిన ఈ మిఠాయిలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.