మొన్న టమాటా.. ఇప్పుడు మిర్చి.. రెచ్చిపోయిన దొంగలు.. - Tv9

ఇటీవల టమాటా రేటు అమాంతం పెరిగిపోవడంతో అనేక చోట్ల టమాటా చోరీలకు పాల్పడ్డారు. రాత్రికి రాత్రి పొలాల్లో కోసి పెట్టిన టమాటాలు మాయం చేసేశారు. మార్కెట్‌కు తరలిస్తున్న టమాటా లోడు వాహనాలను సైతం ఎటాక్‌ చేసి దోచేశారు. ఇప్పుడు మిర్చి వంతు వచ్చింది. తాజాగా కర్నూలు జిల్లాలో మిర్చి దొంగలు రెచ్చిపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రాత్రికి రాత్రే మాయం చేసేశారు. చీడపీడలకే సగం పంట నాశనమవగా.. మిగిలిన సగం ఈ రకంగా దొంగలపాలవుతోందని మిర్చి రైతులు లబోదిబోమంటున్నారు.