అమెరికాలో ముగ్గురు కుటుంబ సభ్యులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి - Tv9

అమెరికాలో భారతీయ కుటుంబంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన తాత, అవ్వ, మామలను దారుణంగా కాల్చి చంపాడు. ఆ ఇంటినుంచి తుపాకి పేలిన శబ్ధం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుకుని నిందితుని అదుపులోకి తీసుకున్నారు.న్యూజెర్సీలోని సౌత్‌ ప్లెయిన్‌ ఫీల్డ్‌లో ఓ అపార్ట్‌మెంట్లో దిలీప్‌ కుమార్‌ బ్రహ్మభట్‌, బిందు బ్రహ్మభట్‌, యశ్‌ కుమార్‌ బ్రహ్మభట్‌ అనే ముగ్గురు నివాసముంటున్నారు. ఇటీవలే దిలీప్‌ కుమార్‌ బ్రహ్హభట్‌ మనవడు ఓం బ్రహ్మభట్‌ కూడా న్యూజెర్సీకి వచ్చి వారివద్దే ఉండి చదువుకుంటున్నాడు.