కార్తిక మాసం శ్రవణా నక్షత్రం సందర్భంగా ఆదివారం శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు ఘనంగా జరిగింది. తిరుమల (Tirumala) లోని కల్యాణవేదిక వద్ద ఉద్యానవన విభాగంలో పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ (Ttd) ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు.